ఎరువుల కొరత రానీయొద్దు

0
5


ఎరువుల కొరత రానీయొద్దు

డీలర్లకు వ్యవసాయాధికారుల ఆదేశాలు

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: సమృద్ధిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పెరుగుతోందని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డీఏవో మేకల గోవింద్‌ ఆదేశించారు. ఆయన వ్యవసాయశాఖ అసిస్టెంటు డైరెక్టర్‌ వాజిద్‌హుస్సేన్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌రెడ్డిలతో కలిసి గురువారం హోల్‌సేల్‌ ఎరువుల డీలర్లతో సమావేశమయ్యారు. ధరల హెచ్చుతగ్గుల గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీ వారీగా ఎంతెంత అమ్ముతున్నారనేది సేకరించారు. ఎవరివద్దా ఎంత మొత్తం నిల్వ ఉందో ఏ రోజుకారోజు నివేదించాలని సూచించారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా  ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. రైతులకు కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here