ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా భారీ బెట్టింగ్… రెండున్నరేళ్లలో మరో మూడు వాహనాలు

0
1


ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా భారీ బెట్టింగ్… రెండున్నరేళ్లలో మరో మూడు వాహనాలు

ఎలక్ట్రిక్ వాహనాలకు దేశీయ మార్కెట్లో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వాహనాల ధర ఎక్కువగా ఉండటం, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వాహనాలకు డిమాండ్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అయితే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తుసేవల పన్ను తగ్గించిన నేపథ్యంలో వాహనాల ధరలు కూడా దిగివచ్చాయి. ఫలితంగా రానున్న కాలంలో వీటి అమ్మకాలు మరింతగా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదేనని భావిస్తున్న కంపెనీలు మరిన్ని కొత్త వాహనాలు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మహీంద్రా…

* మహీంద్రా అండ్ మహీంద్రా రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనుకుంటోంది. ప్రభుత్వం నిర్దేశిత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నీ భారీ స్థాయిలో పెంచాలనుకుంటోంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని కొంతమంది పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కానీ ఇది సాధ్యం అవుతుందని, భారత్ కు ఎలక్ట్రిక్ వాహనాల హబ్ గా మారే సామర్థ్యం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అంటున్నారు. వచ్చే మూడేళ్ళ కాలంలో తమ కంపెనీ రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడి రూ.6,000 కోట్లు ఉంటుందని అయన వాటాదారుల సమావేశంలో వెల్లడించారు.

మేం రెడీ అంటూ..

మేం రెడీ అంటూ..

* తాము ఫ్యూచర్ రెడీగా ఉన్నామని, మార్కెట్ ఊపందుకునేదాక వేచిచూస్తామన్నారు.

* మహీంద్రా ఇప్పటికే వెరిటో సెడాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

* వచ్చే రెండున్నరేళ్ల కాలంలో మరో మూడు ఫోర్ వీలర్లను తీసుకు రావాలని కంపెనీ భావిస్తోంది

* ఈ ఏడాది చివరి నాటికీ ఎలక్ట్రిక్ కేయూవీ, ఏడాది తర్వాత ఎస్ 210, ఆ తర్వాతి ఆరునెలల్లో ఈ-ఆస్పైర్ ను విడుదల చేయాలన్నది కంపెనీ ప్రణాళిక.

* ఇప్పటికే మహీంద్రా 1,500-2,000 ఈ-వెరిటోలను విక్రయించింది.

* ప్రస్తుతం వాహనాల అమ్మకాల్లో మందగమనం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై కూడా ప్రభావం పడుతోంది.

బెనెల్లి...

బెనెల్లి…

* ఇటలీకి చెందిన మోటార్ సైకిళ్ళ తయారీ కంపెనీ బెనెల్లి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకు రావాలనుకుంటోంది. ఇందులో భాగంగా పరిశోధనను ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

* ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ లోనే తన టూ వీలర్లను అసెంబుల్ చేస్తోంది.

* 2023 నాటికీ 150 సీసీ కన్నా తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు, 2025 నాటికీ త్రీవీలర్లను నిషేదించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను ఆటోమొబైల్ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here