ఎల్లాపి సంఘం కార్యవర్గం ఎన్నిక

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఎల్లాపి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని దుబ్బ ప్రాంతంలోని ఎల్లాపి సంఘ భవనంలో ఇందుకు సంబంధించి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడుగా ఎల్లంకి సత్యనారాయణరావు, ఉపాద్యక్షుడుగా పుప్పల లక్మణ్‌ రావు, ఎల్లంకి పురుషోత్తం రావు, ఔదరి శారద, ప్రదాన కార్యదర్శిగా తేలు వేణుగోపాల్‌ రావు, కోశాధికారిగా ఔదరి నర్సింగరావు, ఆర్గనైజింగ్‌ సేక్రేటరిగా బొంగురాల శ్రీనివాస్‌ రావు, జనరల్‌ సెక్రటరీలు వీర్ల శ్రీనాథ్‌ రావు, వీరమల్ల లక్మీకాంత రావులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుందన్నారు. కాగా జనార్ధన్‌రావు, ఉల్సె రాజేశ్వర్‌లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఎల్లాపి కుల బాంధవుల అభివృద్దికి తమవంతు కృషి చేస్తామన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here