ఎల్లారెడ్డి మినీ ట్యాంక్‌బండ్‌ పరిశీలన

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పెద్ద చెరువు కట్ట ప్రమాదాలకు నిలయంగా మారింది. కానీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పెద్దచెరువు కట్టను వెడల్పు చెయ్యండి బాబు అని ప్రజలు మొర్రో అని మొత్తుకుంటే వెడల్పు చేయాల్సింది పోయి మినీ ట్యాంక్‌ బండ్‌ అని తెర పైకి తెచ్చారు టిఆర్‌ఎస్‌ నాయకులు. మినీ ట్యాంక్‌ బండ్‌ కాదు.. కదా చెరువు కట్టమీద ఉన్న గుంతలలో మట్టి పొసే దిక్కులేరు అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గొప్పలకు పోయి ట్యాంక్‌ బండ్‌ చేసి పార్క్‌లు ఏర్పాటు చేస్తాము, ట్యాంక్‌ బండ్‌ చుట్టూ రెలింగ్‌ పెడతాం పిల్లలు పడకుండా అని చెప్పి 5 కోట్ల 41 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఆగమేఘాల మీద అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావును పిలిచి పనులు ప్రారంభించి ఎమ్మెల్యే, ఎంపీ చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ట్యాంక్‌ బండ్‌ పేర ఖర్చు చేసింది 89 లక్షలు.. పని లేదు పాడు లేదు టిఆర్‌ఎస్‌ నాయకుల జేబులు నింపుకున్నారు. వెంటనే ఎన్నికలు వచ్చే మరి ఒక ఎమ్మెల్యే వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని గద్దెనెక్కి పార్టీ మారి టిఆర్‌ఎస్‌ నాయకుల పంచన పడ్డాడు. నిత్యం వందల వాహనాలు తిరిగే రోడ్డులో పడి సచ్చిపోతే అడిగే దిక్కు లేరు అన్ని అన్నారు. మన ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్డులో నిత్యం వెళ్తుంటారు… మరి ప్రజల సమస్యలు పట్టవా అన్ని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని కొత్త రోడ్డు వేయాలని కోరుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here