ఏం తినొచ్చాడో ఒకటే కంపు.. దెబ్బకు అసెంబ్లీ వాయిదా

0
2


అసెంబ్లీలో ఓ సభ్యుడు చేసిన పనికి సభ వాయిదా పడింది. సభకు ఏం తిని వచ్చాడో ఏమో.. ఒకటే కంపు లేపారు. పక్కనే ఉన్న మరో సభ్యుడు ఆ కంపు భరించలేక చచ్చాడు.. ముక్కు మూసుకున్నా వాసన ఆగట్లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశాడు. బాబోయ్ ఈ కంపు భరించడం తన వల్ల కాదంటూ తన బాధను చెప్పాడు. వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. కంపు పోయే వరకు అసెంబ్లీలో స్ప్రే కొట్టించారు.. తర్వాత మళ్లీ సభను కొనసాగించారు. కెన్యాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కెన్యాలో హోమా బే కౌంటీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు స్తంభించడంపై సీరియస్‌గా చర్చ జరుగుతోందట. సభ్యులంతా సీరియస్‌గా చర్చిస్తున్నారు.. తమ, తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతలో జుమా అనే సభ్యుడు పైకి లేచాడు. స్పీకర్ గారూ భరించలేని కంపు బాబోయ్ అంటూ ఫిర్యాదు చేశాడు. ఎవరో సభలో వాసనలు వదులున్నాడని.. ఆయనెవరో కూడా తనకు తెలుసని.. పేరు మాత్రం చెప్పనన్నాడు.

అమ్మో ఈ కంపు భరించలేకపోతున్నాను అంటూ తన బాధను చెప్పుకున్నాడు ఆ సభ్యుడు. వెంటనే పక్కనే ఉన్న ఓ సభ్యుడు (తనపైనే ఆరోపణలు చేశారని అనుకున్నాడో ఏమో) పైకి లేచి ఇంతమంది ఉంటే సభలో ఎలా వదులుతాను అంటూ బదులిచ్చాడు. కొద్దిసేపటికే సభ మొత్తం ఆ కంపు పాకిపోవడంతో సభ్యులు పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకున్నాడో ఏమో స్పీకర్ ఎడ్విన్ కకాచ్ వెంటనే సభను వాయిదా వేశారు. సభ్యుల్ని బయటకు పంపించారు.

సభ్యులందర్ని బయటకు పంపాక.. సభలో అసెంబ్లీ సిబ్బందితో రూమ్ ఫ్రెషనర్లు (వెనీల, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లు) స్ప్రే చేయించారు. అసెంబ్లీలో వాసన పూర్తిగా పోయాక మళ్లీ సభ్యులు మళ్లీ లోపలికి అడుగు పెట్టారు. మొత్తానికి ఆ కంపు దెబ్బకు సభ్యులంతా కాసేపు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here