ఏఐఎస్‌ఎఫ్‌ రాస్తారోకో

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అద్వర్యంలో ఎలారెడ్డి మండల కేంద్రంలో ప్రేవేట్‌ యూనివర్సిటీలో నియామకపు ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నాయకులు విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు కుంచాల గణేష్‌ మాట్లాడుతూ ప్రేవేట్‌ యూనివర్సిటీలలో ప్రభుత్వం నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తుందని వెంటనే నియామకపు ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రేవేటు యూనివర్సిటీల మోజులో పడిందని, ఈపాటికే ఒకటో, రెండో చోట్ల అంతర్జాతీయ యూనివర్సిటీలు వచ్చాయన్నారు. కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల మూలంగా విద్య వ్యాపారంగా మారిందన్నారు. ఇక ప్రవేట్‌ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిస్తే విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య ప్రాథమిక హక్కుగా రాజ్యాగంలో పొందుపరచబడిందని పేర్కొన్నారు. ప్రవేట్‌ యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా విద్య భారంగా మారబోతుందన్నారు. ప్రయివేటు యూనివర్సిటీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రశాంత్‌, మండల నాయకులు దత్తు, రమ్య, నవీన్‌, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here