ఏక కాలంలో రుణమాఫీ చేయాలి

0
0


ఏక కాలంలో రుణమాఫీ చేయాలి

కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి


మాట్లాడుతున్న కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పక్కన మానాల మోహన్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్‌ సిటీ, న్యూస్‌టుడే: ఏక కాలంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో సోమవారం కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి అధ్యక్షతన అ విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ…రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. రుణమాఫీకి ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బ్యాంక్‌ల్లో తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతుందన్నారు. తెరాస రైతుల బాగోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల భూమికి సంబంధించిన రికార్డులు సరిగా లేవన్నారు. రైతులు ఇప్పటికి తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు పలువురు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here