ఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండి

0
3


ఏటీఎం క్యాష్ ఉపసంహరణ కొత్త రూల్స్ తెలుసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత వారం ఏటీఎం నిబంధనలను కొన్నింటిని మార్చింది. దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎం, ఇతర నగదు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు తీసుకోవాల్సిన ఇతర అంశాలను ప్రస్తావించింది. ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు కస్టమర్‌కు డబ్బులు రాకుంటే గడువులోగా రీఫండ్ చేయాలి. లేదంటే బ్యాంకులు పరిహారం చెల్లించాలనే నిబంధన తెలిసిందే. దీంతో పాటు పలు మార్పులు తీసుకు వచ్చింది.

రూ.100 చొప్పున చెల్లించాలి

ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలై కస్టమర్ ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయితే గడువు తేదీలోగా బ్యాంకులు తిరిగి జమ చేయాలి. సాధారణంగా ట్రాన్సాక్షన్స్ జరిగిన రోజుతో పాటు మరో ఐదు రోజులు బ్యాంకుకు గడువు ఉంటుంది. ఆ తర్వాత ఆలస్యమయ్యే ప్రతి అదనపు రోజుకు రూ.100 చొప్పున చెల్లించాలి. మైక్రో ఏటీఎంలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ కారణాల వల్ల ట్రాన్సాక్షన్ విఫలమైతే

ఈ కారణాల వల్ల ట్రాన్సాక్షన్ విఫలమైతే

ఏటీఎంలో హార్డ్ వేర్, సాఫ్టువేర్, కమ్యూనికేషన్ కారణాల వల్ల ట్రాన్సాక్షన్ విఫలమైతే దానిని ట్రాన్సాక్షన్‌‍గా పరిగణలోకి తీసుకోరు. పలు బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ను ఉచితంగా అందిస్తాయి. ఆ తర్వాత ప్రతి అదనపు ట్రాన్సాక్షన్‌కు కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. అయితే ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఫెయిలైన వాటిని పరిగణలోకి తీసుకోరాదు.

నగదు లేకుండా ట్రాన్సాక్షన్ విఫలమైతే

నగదు లేకుండా ట్రాన్సాక్షన్ విఫలమైతే

ఏటీఎంలో నగదు లేకుండా ట్రాన్సాక్షన్ విఫలమైతే దానిని లెక్కలోకి తీసుకోరాదు. ఇలాంటి వాటిపై అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దు. తప్పుడు పిన్ నెంబర్ వంటి కారణాలను కూడా లెక్కలోకి తీసుకోవద్దు. ఉదాహరణకు ఎస్బీఐ 8-10 ఉచిత ట్రాన్సాక్షన్స్‌ను అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు ఈ బ్యాంకు కొంత మొత్తం ఛార్జ్ చేస్తుంది.

వీటిని ఉచిత అకౌంట్లో వేయరాదు..

వీటిని ఉచిత అకౌంట్లో వేయరాదు..

బ్యాలెన్స్ చెకింగ్, చెక్కు బుక్ విజ్ఞప్తులు, ఫండ్స్ ట్రాన్సుఫర్, ఆన్-ఆజ్, ట్రాన్సాక్షన్స్‌ను ఉచిత లావాదేవీల అకౌంట్‌లో వేయరాదు. కొత్త ఏటీఎం రూల్స్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను ఆర్బీఐ ఆగస్ట్ 14వ తేదీన విడుదల చేసింది. ఆన్ – ఆజ్ అంటే సేమ్ బ్యాంకుకు చెందిన డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here