‘ఏడు చేపల కథ’ టాక్: ఏముందిరా అయ్యా ఇందులో.. తిట్టిపోస్తున్న జనం

0
6


టీజర్లు, ట్రైలర్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఏడు చేపల కథ’ సినిమా కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. అడల్ట్ కంటెంట్‌తో వస్తోన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామని ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాగా గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తొలిరోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. టిక్కెట్ల కోసం జనాలు ఎగబడ్డారు.

Also Read: ‘ఏడు చేపల కథ’ రివ్యూ: టెంప్ట్ అయ్యారో..!

అయితే, ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులు దేని కోసం అయితే వెళ్లారో ఆ కంటెంట్ సినిమాలో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సినిమా చూసి బయటకు వచ్చిన తరవాత వాళ్ల ముఖాలు చూసి నవ్వాలో, బాధపడాలో అర్థంకాదు. టిక్కెట్ డబ్బులకు అస్సలు న్యాయం జరగలేదనే ఫీలింగ్ ఒకపక్క.. ‘ఏం చెప్పారు, ఏం చూపించారురా అయ్యా..’ అనే కోపం మరోపక్క. ఈ ఫస్ట్రేషన్‌లో హీరో, దర్శకనిర్మాతలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అసలుసిసలైన బూతులతో తిట్టారు.

Also Read: మా నిర్మాతకు చెవుడు.. సెక్స్ సినిమాతో సెన్సారోళ్లకు చుక్కలు: ‘ఏడు చేపల కథ’ హీరో

వాస్తవానికి టీజర్లు, ట్రైలర్ చూసిన ఎవరైనా ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండరు. అంత ఘోరంగా చూపించారు. ఒకప్పటి షకీలా సినిమాల కన్నా దారుణంగా చూపించారు. దీంతో అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకులు తెగ ఆరాటపడ్డారు. కానీ, సెన్సార్ బోర్డు మాత్రం ఆ సీన్లన్నింటినీ కట్ చేసి పారేసింది. ఇక ఎలాగూ ఆ సీన్లన్నీ ట్రైలర్‌లో చూపించాం కదా.. సినిమాలో మిగిలిన కంటెంట్ చూపిస్తే చాలులే అనుకున్నారేమో దర్శక నిర్మాతలు. ఆ విషయాలేమీ బయటపెట్టకుండా మంచి హైప్ క్రియేట్ చేసి సినిమాను విడుదల చేశారు. ఈ విషయం తెలియక ఎగబడి థియేటర్లకు వెళ్లినవాళ్లు తీవ్ర నిరాశతో బయటికి వస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here