ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్?: గోల్డ్ ఈటీఎఫ్-గోల్డ్ బాండ్స్?

0
2


ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్?: గోల్డ్ ఈటీఎఫ్-గోల్డ్ బాండ్స్?

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పట్ట పగ్గాలు లేకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు సంబరపడిపోతున్నారు. కొనకుండా ఉన్న వారు ఎంత పని చేస్తిమి బంగారం కొని ఉంటే బాగుండు.. ఇప్పుడు కొందామంటే భగ్గుమన వట్టే అని బాధపడి పోతున్నారు. ఇంకా ఎంత వరకు ధర పెరుగుతుందో ఇప్పుడైనా కొందామా అన్న ఆలోచన చేస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్) కొనుగోలుదారులకన్నా సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్ జీ బీ ) కొనుగోలుదారులు ఎక్కువగా లాభపడుతున్నారు. అసలు ఎస్ జీబీ లపై అధిక రిటర్న్ లు రావడానికి కారణం ఏమిటి ? బంగారం ఈటీఎఫ్ లకన్నా గోల్డ్ బాండ్లు ఏవిధంగా మెరుగైనవి అన్న దానిపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. వీటి గురించి తెలుసుకుంటే దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో చూసుకోవచ్చు.

గోల్డ్ ఈటీఎఫ్ లు ఎంత పెరిగాయంటే …

* నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో గోల్డ్ ఈటీఎఫ్ లు గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగాయి. ఈ కాలంలో కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ సగటు వృద్ధి 21 శాతంగా ఉంది.

* స్టాక్ ఎక్స్చేంజి లో నమోదైన సావరిన్ గోల్డ్ బాండ్లు 31 శాతం వరకు రాబడులను అందించాయి.

* ఇదే కాలంలో వివిధ రకాల బాండ్లు సగటున 26.2 శాతం రిటర్న్ ను ఇచ్చాయి. మొత్తంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ ల కన్నా సావరిన్ గోల్డ్ బాండ్లు ఎక్కువగా ప్రయోజనాన్ని కల్పించాయని చెప్పవచ్చు.

గోల్డ్ ఈటీఎఫ్ లపై చార్జీలు..

గోల్డ్ ఈటీఎఫ్ లపై చార్జీలు..

* సావరిన్ గోల్డ్ బాండ్లలో ఎక్కువ రిటర్న్ రావడానికి కారణాలున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ ల మాదిరిగా సావరిన్ గోల్డ్ బాండ్లలో ఎక్స్ పెన్స్ రేషియో ఉండదు

* గోల్డ్ ఈటీఎఫ్ ల పై ప్రతి సంవత్సరం ఎక్స్ పెన్స్ రేషియో కింద 0.35 శాతం నుంచి 0.8 శాతం వరకు వసూలు చేస్తుంటారు. ఫండ్ ఎం ఏ వీ కన్నా ముందే దీన్ని తగ్గిస్తారు. దీనివల్ల ఈటీఎఫ్ కు సంబంధించిన నికర ఆస్థి విలువ ( ఎన్ ఏ వీ ) తగ్గి పోతుంది.

* గోల్డ్ ఈటీఎఫ్ లు ఎక్స్చేంజి ల్లో ట్రేడవుతుంటాయి. అయితే ట్రేడింగ్ ను బట్టి వీటి ధరలు ఆధాపడి ఉంటాయి.

* గోల్డ్ బాండ్ల లో అధిక రిటర్న్ రావడానికి మరో కారణం కూడా ఉంది. బంగారం బాండ్ల ధరను అంతకు ముందున్న కొన్ని రోజుల ధరను లెక్కలోకి తీసుకొని నిర్ణయిస్తారు. 24 క్యారెట్ల బంగారం ధరను లెక్కలోకి తీసుకుంటారు.

* అయితే వీటి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి ట్రేడింగ్ ధర తక్కువగా ఉంటుంది. వీటి ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

* తక్కువ లిక్విడిటీ, అధిక డిస్కౌంట్ వల్ల ఈ బాండ్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

* అయితే దీర్ఘ కాలంలో ఈ బాండ్ల ద్వారా ఎక్కువ రాబడులు రావడానికి అవకాశం ఉన్నందు వల్ల వీటిలో పెట్టుబడి పెట్టడం లాభమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

గోల్డ్ బాండ్స్ ప్రయోజనాలు

గోల్డ్ బాండ్స్ ప్రయోజనాలు

* గోల్డ్ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ బాండ్లపై వార్షికంగా 2. 5 శాతం వడ్డీ రేట్ ను అందిస్తారు. దేన్నీ ప్రతి ఆరు నెలలకు ఒక సారి చెల్లిస్తారు.

* ఈ బాండ్ల పై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎనిమిదేళ్ల కు ఈ బాండ్లు మెచ్యూర్ అవుతాయి. అప్పుడు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ కన్నా ముందే బాండ్లను విక్రయిస్తే గోల్డ్ ఈటీఎఫ్ ల మాదిరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులను మూడేళ్ళ తర్వాత ఉపసంహరించుకుంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* విభిన్న రకాల ఇన్వెస్టర్ల ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ ను తీసుకువచ్చారు. అయితే వీటిలో దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. తమకు నచ్చిన వాటిని ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here