ఏపీఎన్ఆర్టీ సలహాదారునిగా వైఎస్ఆర్ సీపీ నేత

0
0


ఏపీఎన్ఆర్టీ సలహాదారునిగా వైఎస్ఆర్ సీపీ నేత

అమరావతి: విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి సంక్షేమం, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ ఛైర్మన్, సలహాదారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట్ ఎస్ మేడపాటి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్పీ సిసోడియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంతకుముందు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రవి వేమూరి ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ గా పనిచేశారు.ప్రభుత్వం మారిన నేపథ్యంలో- కిందటి నెల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రవి వేమూరి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానంలో ఆర్పీ సిసోడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. తాజాగా వెంకట్ ఎస్ మేడపాటిని నియమించారు.

మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో- ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్, సలహాాదారు స్థానాలను భర్తీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here