ఏపీ అప్పులు 67 శాతం పెరిగితే, 5 ఏళ్లలో తెలంగాణ అప్పులు 159 శాతం

0
0


ఏపీ అప్పులు 67 శాతం పెరిగితే, 5 ఏళ్లలో తెలంగాణ అప్పులు 159 శాతం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగేళ్లలో 67 శాతం పెరిగాయి. విభజనకు ముందు రూ.90వేల కోట్లుగా ఉన్న అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.2,49,435 కోట్లుగా ఉంది. అయిదేళ్లలో చంద్రబాబు అప్పులు మూడింతలు చేశారని అధికారంలోకి వచ్చిన వైసీపీ విమర్శలు కూడా గుప్పిస్తోంది. ఏపీ అప్పులు నాలుగేళ్లలో 67 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విభజన సమయంలో ఏపీ లోటు బడ్జెట్‌లో ఉంది. అయితే మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణలో కూడా ఇదే కాలంలో భారీ ఎత్తున అప్పులు ఉన్నాయని, అయిదేళ్లలో అప్పులు 159 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు.

అయిదేళ్లలో 129 శాతం పెరిగిన అప్పులు

2014 జూన్ 2తో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో రెట్టింపు అప్పులు చేసిన మాట వాస్తవమేనా? అని రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఎంఎ ఖాన్ అడిగిన ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ అప్పులు రూ.69,517 కోట్లు ఉండగా, 2018-19 బడ్జెట్ నాటికి అవి రూ.1,80,239 కోట్లకు చేరాయని తెలిపారు. 2019 మార్చి నాటికి లెక్కల ప్రకారం అయిదేళ్లలో 159 శాతం పెరిగాయని చెప్పారు.

FRBM పరిధికి మించి కేంద్రం అనుమతులు

FRBM పరిధికి మించి కేంద్రం అనుమతులు

డిస్కమ్స్ రుణ భారం స్వీకరించడానికి వీలుగా కేంద్రం FRBM పరిధికి మించి ఒకసారి అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందని, ఉదయ్ స్కీం కింద 2016-17లో మరోసారి రూ.8,923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతిచ్చామని పేర్కొన్నారు.

అప్పులు ఇలా పెరిగాయి

అప్పులు ఇలా పెరిగాయి

2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రుణభారం రూ.79,880 కోట్లు, 2015-16లో రూ.97,992 కోట్లు, 2016-17లో రూ.1,34,738 కోట్లు, 2017-18లో రూ.1,51,133 కోట్లు, 2018-19లో రూ.1,80,239 కోట్లుగా ఉందని తెలిపారు. వడ్డీలు, రుణాల చెల్లింపు వరుసగా 2014-15లో రూ.5,593 కోట్లు, 2015-16లో రూ.7,942 కోట్లు, 2016-17లో రూ.8,609 కోట్లు, 2017-18లో రూ.11,139 కోట్లు, 2018-19లో రూ.11,691 కోట్లుగా ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here