ఏపీ పోలీసుల ‘స్పందన’కు మంచి రెస్పాన్స్ … 97% సమస్యలను పరిష్కరించామంటున్న డీజీపీ

0
2


ఏపీ పోలీసుల ‘స్పందన’కు మంచి రెస్పాన్స్ … 97% సమస్యలను పరిష్కరించామంటున్న డీజీపీ

  ఏపీ పోలీసుల ‘స్పందన’కు మంచి రెస్పాన్స్ || Huge Response To Spandana Programme Says Gowtham Sawang

  ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ శాఖ పని చేస్తున్న తీరుపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు అందుతున్న వినతులను సత్వరం పరిష్కారం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

  వైసీపీ సర్కార్ స్పందన కార్యక్రమంలో అధికారులు కూడా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఇక పోలీస్ శాఖకు వచ్చిన ప్రతి వినతిని గరిష్టంగా 15 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొని, 97 శాతం వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామని పేర్కొన్నారు.

  huge response to Spandana programme ..97% cases solved in police department

  ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో అందుతున్న వినతులలో గత నాలుగు వారాల్లో మొత్తం 10,079 వినతులు అందాయని అందులో 9791 వినతులను పరిష్కరించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సివిల్ వివాదాలు, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించామని పేర్కొన్న డీజీపీ ప్రస్తుతం 288 వినతులు మాత్రమే అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు.

  ఇక అంతే కాకుండా సమస్య తీవ్రతను బట్టి 3082 వినతులపై కేసులు నమోదు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు .కర్నూలు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల పరిధిలో ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపిన డిజిపి మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠాల పని పడుతున్నామని చెప్తున్నారు .గంజాయి, గుట్కాల అక్రమ రవాణా, జూదం, బెట్టింగ్ ల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఆయన వెల్లడించారు. ఇక సోషల్ మీడియా వేదికగా వేధింపులు, అసభ్య కంటెంట్ పెరిగిపోతున్న నేపధ్యంలో సోషల్ మీడియా పై కూడా నిరంతర నిఘా ఉంటుందని ఏదైనా తేడా వస్తే నెటిజన్ల తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటికి పరిష్కారం పొందడానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here