ఏపీ ప్రభుత్వ మద్యం షాపులు .. రిహార్సల్స్ ప్రారంభిస్తున్న అధికారులు

0
1


ఏపీ ప్రభుత్వ మద్యం షాపులు .. రిహార్సల్స్ ప్రారంభిస్తున్న అధికారులు

వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు దృష్టి సారించి ముఖ్యంగా మద్యపాన నిషేధం పై దృషి సారించారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరిగింది. ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , మద్యంపై కొత్త పాలసీ తీసుకురానున్నారని ప్రజల్లో చర్చ జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది . ఇక ఈ నేపధ్యంలో మద్యంపై పరస్పర విరుద్ధంగా జగన్ స్టేట్ మెంట్స్ ఉన్నాయని టీడీపీ విమర్శించింది. అయినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం మద్యం విషయంలో తమ నిర్ణయం మార్చుకోమని ప్రభుత్వమే కొత్త మద్యం షాపులు నిర్వహిస్తారని తేల్చేసింది. అందుకు రిహార్సల్స్ కూడా ప్రారంభించింది .

  అక్క చెల్లెమ్మలకు మాటిచ్చా, మద్యం కనీళ్ళు తుడుస్తా
   అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 750 మద్యం షాపులను నిర్వహించనున్న ప్రభుత్వం

  అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 750 మద్యం షాపులను నిర్వహించనున్న ప్రభుత్వం

  మద్యం కారణంగా మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీరు తుడుస్తానని మాట ఇచ్చిన జగన్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కానీ ఇదే సమయంలో మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ అందులో భాగంగా చర్యలను చేపట్టింది.

  రాష్ట్రంలో సెప్టెంబర్‌ చివరి వరకు కొనసాగించుకునేలా అవకాశమిచ్చినా లైసెన్సు రెన్యువల్‌ చేసుకోని 750 మద్యం షాపుల్ని వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ అధికారుల్ని ఆదేశించారు.

   ప్రభుత్వ మద్యం షాపుల నిర్వహణకు కసరత్తు .. విధివిధానాల రూపకల్పన

  ప్రభుత్వ మద్యం షాపుల నిర్వహణకు కసరత్తు .. విధివిధానాల రూపకల్పన

  అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎక్సైజ్ శాఖ కమీషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెన్యువల్‌ చేసుకోని షాపుల్ని వెంటనే ప్రారంభించాలని, అలా చేస్తేనే ప్రభుత్వం మద్యం షాపులని ఎలా నిర్వహించాలో, సాధకబాధకాలు ఏంటో, ఇబ్బందులు, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుస్తాయని కమిషనర్ అన్నారు. ఇక ఏపీ సర్కార్ స్వయంగా తామే మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో చాలామంది లైసెన్సులు రెన్యువల్ చేసుకునేందుకు సైతం ఆసక్తి చూపడం లేదు.

  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులుంటే 750 షాపులు లైసెన్సులను రెన్యువల్‌ చేసుకోలేదు. అయితే మద్యం షాపులను రెన్యువల్ చేసుకోని వాటిని ప్రభుత్వమే నడపాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో 130 మద్యం షాపులను ఆగస్టు మొదటి వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. అయితే.. ఎక్సైజ్‌ అధికారులకు అనుభవం ఉన్న కారణంగా రెన్యువల్‌ చేసుకోని అన్ని మద్యం షాపుల్ని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను పంపిస్తామని ఎక్సైజ్ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.

  మద్యం షాపుల నిర్వహణకు నోడల్‌ అధికారులుగా జాయింట్ కలెక్టర్లు

  మద్యం షాపుల నిర్వహణకు నోడల్‌ అధికారులుగా జాయింట్ కలెక్టర్లు

  ఇక మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల్లో నోడల్‌ అధికారులుగా జిల్లా సంయుక్త కలెక్టర్లను నియమిం చారు . ఇక జేసీలతో నోటిఫికేషన్‌ జారీ చేయించేలా ఎక్సైజ్‌ అధికారులు చొరవ చూపించాలని సూచించారు ఎక్సైజ్ శాఖా కమీషనర్ . త్వరలో అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని, వీరిని నియమించే కాంట్రాక్టు ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు నోడల్‌ అధికారులుగా బాధ్యత నిర్వర్తిస్తారు .  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here