ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగులో ఉన్న 3500 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ఎయిడెడ్‌ కళాశాలలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. పెండింగులో ఉన్న రియంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, లేనియెడల ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి అనిల్‌, మండల కన్వీనర్‌ గంగాప్రసాద్‌, గణేష్‌, రాహుల్‌, రాకేష్‌, సంజీవ్‌, మౌనిక, శ్రీజ, లక్ష్మీ, గీత తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here