ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!

0
4


ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో 93 లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఆ క్రమంలో రిమాండ్ నిమిత్తం ఆమె చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే ఆమెను మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

ఏసీబీ అధికారుల వినతి మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. ఆ మేరకు ఎమ్మార్వో లావణ్యను రెండు రోజుల కస్టడీకి తీసుకోనున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను శుక్రవారం నాడు కస్టడీకి తీసుకోనున్నారు.

ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందుర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. అయితే ఆయన ఇచ్చిన సమాచారంతో దాని వెనుక ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించారు ఏసీబీ అధికారులు. ఆ మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారుల సోదాల్లో 93 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారు. రెండేళ్ల కిందట ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్‌ కావడం గమనార్హం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here