ఐటీ రిటర్నుల్లో తప్పులు దొర్లినప్పుడు.. ఏం చేయాలి?

0
5


ఐటీ రిటర్నుల్లో తప్పులు దొర్లినప్పుడు.. ఏం చేయాలి?

ఆర్థిక సంవత్సరం 2018-19కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31తో ముగిసింది కదా? మరి మీరు ఐటీ రిటర్నులు దాఖలు చేసేశారా? రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? మంచిది. అయితే ముందు మీరు ఒక పనిచేయాలి. మీరు సమర్పించిన ఐటీ రిటర్న్ సక్రమంగా ప్రాసెస్ అయిందా? లేక ఏదైనా పొరపాటు దొర్లిందా? చెక్ చేసుకోవాలి.

దీనికోసం మీరు మీ ఈ-మెయిల్ లేదా మొబైల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే, ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకేదైనా మెయిల్‌గానీ, మెసేజ్‌గానీ వచ్చి ఉండొచ్చు. అలాగే మీరు ఇంకొక చోట కూడా తనిఖీ చేయాలి. అదే ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్. ఈ మూడు చోట్ల ఐటీ శాఖ నుంచి మీకేమైనా నోటీస్ వచ్చిందేమో చెక్ చేయండి.

నోటీసు వచ్చిందా? ఫర్వాలేదు….

మీరు సమర్పించిన ఐటీ రిటర్స్స్ ప్రాసెస్ అవలేదా? ఆదాయపు పన్ను శాఖ నుంచి మీ ఈ-మెయిల్ లేదా మొబైల్‌కు నోటీసు వచ్చిందా? కంగారుపడాల్సిందేమీ లేదు. రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుంది. ఈసారి ఐటీ రిటర్ను పత్రంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి సరిగా అర్థం కాకపోవడం వల్ల ఫైలింగ్ సమయంలో పొరపాట్లు కూడా దొర్లాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అక్కడి ‘వర్క్‌లిస్ట్’లో ‘ఫర్ యువర్ యాక్షన్’లో నోటీసులను చూడొచ్చు.

ఎందుకు తిరస్కరిస్తారంటే...

ఎందుకు తిరస్కరిస్తారంటే…

ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతోపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా వచ్చిన వడ్డీలు, ఇంటి అద్దె ద్వారా వచ్చిన ఆదా యంగాని, ఇంకా ఇతర పెట్టుబడులపై వచ్చిన ఆదాయాన్ని మీ రిటర్న్‌లో పేర్కొనకపోతే.. మీరు వేసిన ఐటీ రిటర్న్స్‌ను ఆమోదించకుండా తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం ‘రివైజ్డ్’ రిటర్న్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈ-వెరిఫై చేయాలి, లేకుంటే...

ఈ-వెరిఫై చేయాలి, లేకుంటే…

ఐటీ రిటర్న్ దాఖలు చేసిన తరువాత తప్పనిసరిగా దానిని ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఓటీపీ, బ్యాంక్ ఆన్‌లైన్ ఖాతా ద్వారా, ఈవీసీ తదితర పద్ధతుల్లో ఈ-వెరిఫై చేయొచ్చు. ఇలా చేయని రిటర్న్‌లు చెల్లవు. కాబట్టి ఐటీ రిటర్న్ సమర్పించిన ప్రతి ఒక్కరూ 120 రోజుల్లోగా ఈ-వెరిఫైని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ-వెరిఫై చేయడం తెలియని పక్షంలో రసీదుపై సంతకం చేసి దానిని పోస్టు ద్వారా బెంగళూరులోని సీపీసీ చిరునామాకు పంపించాలి.

‘రివైజ్డ్ రిటర్న్' వేసుకోవచ్చు...

‘రివైజ్డ్ రిటర్న్’ వేసుకోవచ్చు…

గడువు లోపల దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ ‘రివైజ్డ్ రిటర్న్’ వేయాల్సి ఉంటుంది. మొదట వేసిన రిటర్నుకు దీనికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎక్కడ తప్పులు దొర్లాయో అక్కడ జాగ్రత్తలు తీసుకుని, అంతకుముందు వేసిన రిటర్నుకు సంబంధించిన రసీదు సంఖ్య, తేదీని నమోదు చేస్తూ.. ‘రివైజ్డ్ రిటర్న్’ అని పేర్కొంటే చాలు.

గడువులోగా ఎన్నిసార్లయినా...

గడువులోగా ఎన్నిసార్లయినా…

తొలుత ఫైల్ చేసిన ఐటీ రిటర్న్‌లో తప్పులు దొర్లాయి అని అనుకున్న వారు ఈ రివైజ్డ్ రిటర్న్ వేయొచ్చు. గతంలో నిర్ణీత వ్యవధిలోపు ఐటీ రిటర్న్ సమర్పించిన వారిని మాత్రమే ఈ రివైజ్డ్ రిటర్న్ వేసుకునేందుకు అనుమతించేవారు. కానీ ఇప్పుడు నిర్ణీత వ్యవధి తరువాత రిటర్న్ వేసిన వారినీ ఈ రివైజ్డ్ రిటర్న్ వేయడానికి అనుమతిస్తున్నారు. మొదటిసారి ఐటీ రిటర్న్ వేసిన తరువాత ఎన్నిసార్ల్లు అయినా ఈ ‘రివైజ్డ్ రిటర్న్ వేసుకోవచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే.. మార్చి 31, 2020 వరకు ఈ రివైజ్డ్ రిటర్న్ వేయడానికి సమయం ఉంది.

రిఫండ్ ఎప్పుడొస్తుందంటే...

రిఫండ్ ఎప్పుడొస్తుందంటే…

ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండ్ రావాలంటే మొదట మీరు సమర్పించిన ఐటీ రిటర్న్‌లో గణాంకాలన్నీ సవ్యంగా ఉండి.. అది ‘ప్రాసెస్’ అవ్వాలి. మీ రిటర్న్ ప్రాసెస్ అయిపోతే.. మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఇక ఆ తరువాత రిఫండ్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ మీరు కోరిన రిఫండ్‌కు, వాస్తవానికి మీకు వచ్చే రిఫండ్‌కు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉన్నా కూడా ఆ విషయాన్ని మీకు ఐటీ శాఖ తెలియపరుస్తుంది. ఆ తరువాతే మీ బ్యాంకు ఖాతాలో రిఫండ్ జమ అవుతుంది.

తప్పుడు సమాచారానికి స్పందించకండి...

తప్పుడు సమాచారానికి స్పందించకండి…

ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు అందే ఏ సమాచారమైనా donotreply@incometaxindiaefiling.gov.in అనే ఐడీ నుంచే వస్తుంది. మీకు వచ్చే ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ఈ చిరునామా నుంచి కాకుండా మరేదైనా ఐడీ నుంచి గనుక వస్తే.. అది మోసపూరిత సమాచారం అని మీరు జాగ్రత్తపడాలి. రిఫండ్‌ జమకు సంబంధించి మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగాలేవని పేర్కొంటూ ఏదైనా మెసేజ్ లేదా మెయిల్ వస్తే మీరు అప్రమత్తమవ్వాలి. ఎందుకంటే, మీ నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోనే అడుగుతుంది. మీరు కూడా ఆ సమాచారాన్ని అక్కడే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here