ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా: పాక్ క్రికెటర్

0
2


పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ మరొకసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచకప్‌ జరుగుగుతుండగా.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని రజాక్‌ అన్నాడు. దీంతో రజాక్‌ను భారత అభిమానులు ట్రోల్ చేశారు. అనంతరం షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇక తాజాగా పాక్‌ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

 అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు:

అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు:

ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ… ‘నేను సంప్రాదయబద్దంగా పెళ్లి చేసుకున్నా. పెళ్లి అనంతరం సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నా. ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. ఇది నాకు ఏమాత్రం తప్పనిపించడం లేదు’ అని రజాక్ అన్నారు.

రజాక్ ఇలాంటోడా:

రజాక్ ఇలాంటోడా:

రజాక్ మాటలతో అక్కడ ఇంటర్వ్యూ చేసే యాంకర్, యూనిట్ సభ్యులతో పాటు వీక్షకులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. రజాక్ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో అర్దమవుతుందా?’, ‘ఇప్పటివరకు గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది. ఈ క్షణంతో అది పోయింది’, ‘రజాక్ ఇలాంటోడా?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ముస్లిం కాబట్టే:

ముస్లిం కాబట్టే:

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ముస్లిం కాబట్టే శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం పెట్టారని పాకిస్తాన్‌ క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతంగా రాణించాడని, మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడని పేర్కొన్నారు. రజాక్‌ ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముస్లిం అయిన షమీ ఒక్కడే ఇంగ్లండ్‌పై పోరాడాడని, మిగతా బౌలర్లు ఏమాత్రం రాణించలేకపోయారని’ వ్యాఖ్యానించాడు.

పాండ్యా కూడా:

పాండ్యా కూడా:

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తున్న కాఫీ విత్‌ కరణ్‌ షోలో హార్దిక్‌ పాండ్యా కూడా అబ్దుల్‌ రజాక్‌ లాగే మహిళల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. దీంతో పాండ్యాపై వేటు పడింది. అయితే వేటు సరైంది కాదని, చేసిన తప్పుకు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాశారు. ఇందుకు సోషల్‌ మీడియా వేదికగా పాండ్య క్షమాపణలు కూడా చెప్పాడు. దీంతో బీసీసీఐ సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే రజాక్‌కు పెళ్లి అయినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here