ఐసీసీ జాబితాలో రోహిత్ శర్మకు ప్రత్యేకమైన స్థానం

0
1


హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన 12వ ఎడిషన్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఐదుగురు ప్రత్యేక బ్యాట్స్‌మెన్‌ పేర్లను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. మొత్తం 46 రోజుల పాటు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా ఐసీసీ తన ట్విటర్‌‌లో ”ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ప్రత్యేకం” అంటూ కామెంట్ పెడుతూ ఓ వీడియోని పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ ప్రపంచకప్‍‌లో రోహిత్ శర్మతో పాటు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌‌లు ఐదొందలకు పైగా పరుగులు చేశారు.

ఈ ప్రపంచకప్‌లో మొత్తం పది మ్యాచ్‌లాడిన రోహిత్‌ శర్మ 81 యావరేజితో 648 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ మాంచెస్టర్ వేదకగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో మాత్రం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here