ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన కోహ్లీ: మ్యాచ్‌కే హైలెట్ (వీడియో)

0
2


హైదరాబాద్: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ(120) సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (71) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించారు.

కోహ్లీ బాగా ప్రోత్సహించాడు: మనసులో మాటను బయటపెట్టిన అయ్యర్

వరుసగా వికెట్లు కోల్పోయిన విండిస్

వరుసగా వికెట్లు కోల్పోయిన విండిస్

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. లక్ష్య చేధనలో 27 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న విండిస్ ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1-0 ఆధిక్యంలో టీమిండియా

1-0 ఆధిక్యంలో టీమిండియా

ఫలితంగా మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మూడు క్యాచ్‌లు పట్టగా… వెస్టిండిస్ క్రికెటర్ ఎవిన్ లూయిస్ క్యాచ్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, జట్టు స్కోరు 148 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు.

కుల్దీప్ బౌలింగ్‌లో

కుల్దీప్ బౌలింగ్‌లో

80 బంతుల్లో 65 పరుగులతో మంచి ఊపు మీదున్న ఎవిన్ లూయస్ ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన షార్ట్ బంతిని బ్యాట్ పుట్ వేసి మరీ కవర్స్ వైపుకి ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో దానిని ఒడిసి పట్టుకున్నాడు. కష్టం అనుకున్న క్యాచ్‌ని కోహ్లీ అలవోకగా పట్టడంతో లూయిస్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన కోహ్లీ

దీంతో ఒక్కసారిగా స్టేడియంలోని అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here