ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు… ఐదుగురు మృతి

0
2


ఒకదాని వెనక మరోటి.. ఢీ కొన్న ఆరు కార్లు… ఐదుగురు మృతి

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది. పుదుకోటై-తిరుచ్చి రహదారిలో కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనక కార్లు ఢీ కొన్నాయి. ఇలా ఆరు కార్లు ఢీ కొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. కార్లు ఎక్కడివక్కడ నుజ్జనుజ్జయిపోయాయి. ప్రమాదస్థలిలో పరిస్థితి భీతావాహంగా మారిపోయింది. మృతదేహలు చెల్లాచెదురుగా డిపోయాయి. అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. 21 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఏడుగురి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులు చెప్తున్నారు. సంఘటనస్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఒకదానికొకటి కార్లు ఢీ కొనడంతో దర్యాప్తు చేస్తున్నామని .. ఇన్వెస్టిగేషన్‌లో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి పెద్దలే చనిపోవడంతో .. తమకు ఎవరూ దిక్కని రోదిస్తున్నారు. వారి గ్రామాల్లో విషాద వదనం నెలకొంది. మరోవైపు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేస్తామని ఒక ప్రకటనలో తెలియజేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here