ఒక మ్యాచ్‌కా లేదా 100 మ్యాచ్‌లకా అని చూడను: గొప్ప గౌరవమన్న రోహిత్ శర్మ

0
0


హైదరాబాద్: కెప్టెన్సీ అనేది ఒక మ్యాచ్‌కా లేదా వంద మ్యాచులకా అని తాను చూడనని బంగ్లాదేశ్‌తో మూడు టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా వ్వవహారించబోతోన్న రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం ఎప్పుడు వచ్చినా దానిని ఆస్వాదిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో తాను కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

పనిభారం కారణంగా ఈ సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

రిఫరీ సెల్ఫీ మోజు ఎంతపని చేసింది!: యెల్లో కార్డు చూపించి మరీ విజ్ఞప్తి (వీడియో)

కెప్టెన్సీ అనేది మన చేతుల్లోలేదు

కెప్టెన్సీ అనేది మన చేతుల్లోలేదు

“కెప్టెన్సీ అనేది మన చేతుల్లోలేదు. టీమిండియాకు సారథ్యం వహించడమంటేనే గొప్ప గౌరవం. ఒక మ్యాచ్‌కా లేదా వంద మ్యాచులకా అని నేను చూడను. మనం అద్భుతంగా రాణిస్తున్నప్పుడు దేశం కోసం ఆడటమే మిన్న. నేను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను మరియు అనుభవం బాగుంది. నన్ను ఎంతకాలం కెప్టెన్‌గా ఉంచుతారనే దాని గురించి నేను ఆలోచించను. సారథ్యం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆస్వాదించాను” అని రోహిత్ అన్నాడు.

డే/నైట్ టెస్టు కోసం ఆతృతగా ఉన్నా

డే/నైట్ టెస్టు కోసం ఆతృతగా ఉన్నా

టెస్టు ఓపెనర్‌గా ప్లడ్ లైట్ల్ కింద భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు ఆడటంపై రోహిత్ “ఇది మొదటిసారి కాబట్టి నేను చాలా ఆతృతగా ఉన్నా. నేను ఇతరుల గురించి చెప్పలేను, కాని నేను దులీప్ ట్రోఫీలో పింక్ బంతితో ఒక మ్యాచ్ ఆడాను మరియు ఇది మంచి అనుభవం. ఇదొక మంచి అవకాశం మంచి ప్రదర్శన చేయడానికి” అని రోహిత్ శర్మ అన్నాడు.

ఎప్పుడూ మంచిగా ఆడేందుకే ప్రయత్నిస్తా

ఎప్పుడూ మంచిగా ఆడేందుకే ప్రయత్నిస్తా

“నేను ఎల్లప్పుడూ మంచిగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. నా పని మంచి ప్రదర్శన చేయడమే. అది బంగ్లాదేశ్ అయినా లేక వెస్టిండీస్ అయినా. మేము న్యూజిలాండ్ వెళ్ళినప్పుడైనా ఆ విధంగానే నేను ఆలోచిస్తా ” అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్ అనంతరం బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

కోహ్లీకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

కోహ్లీకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుని ప్లడ్ లైట్ల కింద డే/నైట్ టెస్టుగా నిర్వహించనున్న సంగత తెలిసిందే. టీ20 సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ టెస్టు సిరిస్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడు. దీంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని రోహిత్ అన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here