ఒక రోజు ఆలస్యంగా బీసీసీఐ ఎన్నికలు.. ఎందుకంటే?

0
1


న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్‌ 22న కాకుండా.. ఒక రోజు ఆలస్యంగా అక్టోబర్‌ 23న ఎన్నికలు జరగనున్నాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరుగుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

IND vs SA: 15 ఏళ్లకే భారత్ తరఫున అరంగేట్రం.. రికార్డుల్లో షఫాలీ వర్మ!!

హరియాణా, మహారాష్ట్ర సంఘాల నుంచి బీసీసీఐ ఎన్నికల్లో ఓటువేసేవారు ఎలాంటి ఇబ్బంది పడకూడనే ఒక రోజు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారట. మరోవైపు రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్‌ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం క్రికెట్ సంఘాలలో పూర్తిస్థాయి హోదా కలిగిన 24 క్రికెట్ సంఘాలు కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు సరికొత్త నిబంధనలతో బీసీసీఐ అనుబంధ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఇండియన్ రైల్వేస్, సర్వీసెస్, ఇండియన్ యూనివర్శిటీస్ క్రికెట్ సంఘాలు మాత్రం తమతమ ప్రతినిధులను బీసీసీఐకి పంపుతాయి. బీసీసీఐకి ఎన్నికలు జరిగి.. కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతోనే సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల పాలకమండలి విధుల నుంచి ఉపసంహరించుకోనుంది. 2017 నుంచి వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి పర్యవేక్షణలోనే బీసీసీఐ పని చేస్తూ వస్తోంది. బీసీసీఐలో ఏ సమస్య వచ్చినా.. కచ్చితంగా పాలకమండలి దృష్టికి వెళుతున్న విషయం తెలిసిందే. పాలకమండలిలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, రవి తోడ్గె సభ్యులుగా ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here