ఓటమి ఓ అద్భుత అనుభవం, భారత్‌లో మార్పు రావాలి: నందన్ నీలేకని

0
3


ఓటమి ఓ అద్భుత అనుభవం, భారత్‌లో మార్పు రావాలి: నందన్ నీలేకని

వ్యాపార వైఫల్యాన్ని భారత్‌లో జీర్ణించుకోలేరని, కానీ ఓడిపోవడం ఓ కళ అని, దాని నుంచి విజయానికి మెట్లు నిర్మించుకోవచ్చునని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని అన్నారు. బెంగళూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఓటమి అనే కళలో పండిపోయిందన్నారు భారత్‌లో మాత్రం ఓటమికి బాధపడుతారని, ఇది మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సిలికాన్‌ వ్యాలీ మాత్రం ఓటమికి వెరవకుండా రిస్క్‌ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. బిజినెస్‌మెన్ ఓటమి బాధ నుంచి తప్పించడానికి భారత్‌లో చాలా సామాజిక మార్పులు అవసరమన్నారు. వ్యక్తుల్ని ఓటమి బాధ నుంచి మళ్లించేందుకు భారత్‌లో సామాజిక మార్పులు అవసరమని, సిలికాన్ వ్యాలీలో వలే ఓటమిని, విజయానికి ఓ మార్గాన్ని కల్పించే అద్భుతమైన అనుభవంగా భావించే పరిస్థితి రావాలన్నారు.

మన దేశంలో ఎవరైనా విఫలమైతే ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ పూర్తిగా ఆ వైఫల్యంలో కూరుకుపోతారన్నారు. ఇటీవల కాఫీ డే వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందన్ నీలేకని ఈ వ్యాఖ్యలు చేశారు. నీలేకని కూడా కాఫీ డేలో వాటాదారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here