ఓటరు నమోదుకు అవకాశం

0
4


ఓటరు నమోదుకు అవకాశం

పక్కాగా జాబితా సవరణ చేపట్టాలి

● ప్రణాళిక విడుదల చేసిన ఎన్నికల సంఘం

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

జ్వరాలపై వైద్యులను ఆరా తీస్తున్న ఉప డీఎంహెచ్‌వో శోభారాణి

న్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు మరోసారి అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసింది. ప్రతి అక్టోబరులో ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, మార్పులు, చేర్పులు చేసేవారు. ఇక నుంచి ఆగస్టు నెలలోనే చేపట్టాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ నెలాఖరు వరకు ఓటరు నమోదు చేసుకోవచ్ఛు బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌వో) వద్ద ఉండే జాబితాలో పేరుందో, లేదో చూసుకోవచ్ఛు లేకుంటే నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఓటర్‌ గుర్తింపు కార్డు అనేది కేవలం ఓటేసేందుకు మాత్రమే కాదు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అవసరం.

నమోదు ఇలా

* 2020 జనవరి 01 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు అర్హులు.

* ఓటర్‌ జాబితాలో పేరుందా? లేదా? అనేది ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు /Rwww.ceotelanhana.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అడిగిన వివరాలను నమోదు చేస్తే తెలిసిపోతుంది.

* కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు ఫారం-6లో వివరాలు నమోదు చేసి కావల్సిన ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యం వద్దు

చాలా మంది ఎన్నికల సమయంలోనే ఓటరు జాబితాలో పేరు లేదని లొల్లి చేస్తుంటారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నప్పుడు ఏమాత్రం స్పందించరు. తమ పేరు జాబితాలో ఉందో? లేదో చూసుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోంది. ఈ సారి నమోదుకు అవకాశం ఉన్నందున ఎవరూ నిర్లక్ష్యం చేయొద్ధు

* వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్నాయా! అయితే ఓటరుగా చేరేందుకు మీకు అవకాశం ఉంది.

* మీ ఓటు ఒక ప్రాంతంలో ఉండి, నివాసం వేరే చోట ఉన్నట్లయితే మీరు ఉంటున్న చోటుకే మార్పు చేసుకోవచ్ఛు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here