ఓటరు వెరిఫికేషన్‌లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రాంలో అన్ని శాఖలు భాగస్వాములై జిల్లాను అగ్రస్థానంలో నిలిచేందుకు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 1, 2020 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఓటరు జాబితాలలో ఓటరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓటు నమోదు పరిశీలనలో జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆయా సంక్షేమ శాఖలు పనిచేసిన అధికారులు సిబ్బంది అందరూ పాల్గొనాలని చెప్పారు. డిఆర్‌డిఏ అధికారులు, మున్సిపాలిటీ మెప్మా శాఖలు, స్వయం సహాయక బంద మహిళలచే విఈపి పరిశీలన చేయించి జిల్లాను అగ్రస్థానంలో ఉండేవిధంగా ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన చొరవ చూపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత ప్రస్తుతం కొంచెం పరవాలేదు గాని ఇంకా పూర్తిస్థాయిలో చేపట్టాలని, ప్రత్యేక కార్యక్రమంతో ముగియదనీ నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులు, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ అధికారులుగా తమ శాఖలో పని చేస్తున్న వారు గ్రామ ప్రత్యేక అధికారిగా పని చేస్తున్నందున వారు ప్రత్యేక చొరవతో గ్రామాలను నిరంతరం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకునే విధంగా వారికి తగు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here