ఓటర్‌ నమోదు పక్రియ వేగవంతం చేయాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని డీఆర్వో అంజయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బిఎల్‌వోలు చేపట్టిన ఓటర్‌ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 27,149 ఓటర్ల గాను నాలుగువేల ఓటర్లను మొబైల్‌ యాప్‌ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ చేయడంతోపై మండిపడ్డారు. మిగతా 23 వేల ఓటర్‌ లిస్టులను ఎప్పటికళ్ల పూర్తి చేస్తారని త్వరితగతిన వారం వ్యవధిలో పూర్తి చేయాలని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌కు సూచించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటర్‌ నమోదు కోసం బీఎల్వోలు స్థానికంగా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారని, వారి వద్ద నమోదు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌, అంగన్‌వాడి కార్యకర్తలు సురేఖ, అరుణ, రాణి, భాగ్యలక్ష్మి, జమున, గంగామణి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here