ఓటర్‌ పరిశీలన కార్యక్రమం సరిగా జరిగేలా చూడాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితా కనుగుణంగా ఓటర్ల పరిశీలన అందరికీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించడానికి అన్ని విభాగాలలో సంబంధిత ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇందుకై డ్వాక్రా సంఘాల సభ్యులను, విద్యార్థులను, ఉపాధి హామీ పథకం సభ్యులను, అంగన్‌వాడి కార్యకర్తలను, ప్రభుత్వ ఉద్యోగులను, జిల్లా అధికారులను, ఉపాధ్యాయులను, భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. ఇందుకుగాను ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. దాంతోపాటు ఎన్‌విఎస్‌పిని కూడా వాడుకునేలా చూడాలని ఆయన తెలిపారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా బౌండరీలు సెక్షన్ల వారీగా మ్యాపులను గూగుల్‌లో సిద్ధం చేసుకునేలా బిఎల్‌ఓలను ఆదేశించాలని తెలిపారు. ఫారం 6 ద్వారా ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను వెంట వెంట పరిశీలించి డిస్పోజ్‌ చేయాలని ఆదేశించారు. ఎలక్టోరల్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రాంకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్‌లో సీడీలు పంపిస్తున్నామని ప్రజల అవగాహన కొరకు సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here