ఓబీసీ మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్లను నిజామాబాద్‌లో ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌లో బీసీ చైతన్యం చాలా ఉందని అన్నారు. నిజామాబాద్‌ బీసీల సత్తాను ఈ నెల 7న హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో జరిగే ఓబిసి జాతీయ మహాసభలో చాటాల్సిన అవసరముందన్నారు. బీసీలు రాజ్యాంగం రాజ్యాధికారం వైపు అడుగు వేయాల్సిన తరుణం వచ్చిందని, దానిలో భాగంగానే మొదటి అడుగుగా అఖిల భారత ఓబిసి మహాసభ అని అన్నారు. బీసీలందరూ కూడా మేమెంతో మాకు అంత వాటా అనే నినాదం ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నా కాని పాలకులు పెడచెవిన పెడుతున్నందున, ఇక తమ సత్తా చాటాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నట్టు రాజ్యాధికారమే అన్ని తాళాలకు తాళపు చెవి కాబట్టి రాజ్యాధికారం వైపు బీసీలు ప్రయాణించాల్సిన అవసరం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో బీసీలకు అరకొర కేటాయింపులను ఇక ముగించాలని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here