‘కంపు’ పోటీలు.. కడుపులో గ్యాస్‌ను గాల్లో కలిపితే బహుమతి!

0
3


హుశా.. మీరు ఇలాంటి పోటీల గురించి ఎప్పుడూ విని ఉండరు. ఎందుకంటే.. ఇక్కడ రాతల్లో చెప్పడానికే అదెంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగని చెప్పడం మానేస్తే మీకో అరుదైన విషయం తెలియకుండా పోతుంది. అసలు సంగతి ఏమిటంటే.. ఇండియాలో తొలిసారిగా పిత్తుల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరైతే ముక్కు మూయించేంత కంపు వదులుతారో వాళ్లే విజేతలు.

ఈ నెల 22న గుజరాత్‌లోని సూరత్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకుడు, గాయకుడు యతిన్ సంగోయ్ మాట్లాడుతూ.. ‘‘అందరి మధ్య పిత్తడాన్ని అంతా తప్పుగా భావిస్తారు. కానీ, అది ఎంతో ఆరోగ్యవంతమైనది. శరీరంలో ఉండే గాలిని బయటకు వదిలేయడం తప్పే కాదు. మానవ శరీరంలో జరిగే చర్యల్లో ఇది కూడా ఒకటి’’ అని తెలిపారు.

Read also: గాజు ముక్కలే అతడి ఆహారం.. 45 ఏళ్ల నుంచి నమిలి మింగేస్తున్నాడు!

ఇలా మొదలైంది: ‘‘సుమారు 25 ఏళ్ల కిందట నా కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తుండగా.. నేను గట్టిగా పిత్తాను. దీంతో ఇంట్లో వాళ్లు గట్టిగా నవ్వారు. నన్ను పిత్తుల పోటీలకు పంపిస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. అప్పటి నుంచి పిత్తుల పోటీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నా మదిలో ఉండిపోయింది. ఈ విషయాన్ని నా స్నేహితులకు చెబితే నవ్వేవారు’’ అని యతిన్ తెలిపాడు.
దసరాకు ఒక వారం ముందే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని యతిన్ తెలిపాడు. ఈ సందర్భంగా అతడు ఫేస్‌బుక్‌లో Fart Competition (Surat chapter) అనే ఈవెంట్ పేజీని ప్రారంభించాడు. ఈ పోటీల్లో పాల్గొనేవారి కోసం వేదిక వద్ద ప్రత్యేక ఆహారాలను సిద్ధం చేస్తున్నారు. బంగాళ దుంప, పప్పు, బీన్స్, ముల్లంగి తదితర వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. పోటీదారులు అవన్నీ ఆరగించిన తర్వాత పోటీ మొదలవుతుంది.

Read also: ఓ మై గాడ్.. రోడ్డు మీద నుంచి ఇంటి పైకి ఎక్కేసిన ట్రక్కు, వీడియో వైరల్

ఇందులో ఎవరైతే లయబద్దమైన శబ్దంతో పిత్తుతారో వారే విజేతలని యతిన్ తెలిపాడు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచేవారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులు ఇస్తామన్నాడు. దీపావళి తర్వాత అహ్మదాబాద్‌, ముంబయి, కోల్‌కతాలో ఈ వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నామని యతిన్ తెలిపాడు. మీలో ఎవరికైనా పిత్తుల్లో నైపుణ్యం ఉంటే తప్పకుండా తమని సంప్రదించాలని కోరాడు. కానీ.. ఈ పోటీలకు జడ్జిగా వ్యవహరించేవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఆలోచించండి!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here