కత్తెర పురుగు నివారణకు చర్యలు

0
0


కత్తెర పురుగు నివారణకు చర్యలు

పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు

ఆర్మూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మొక్కజొన్న పంటకు ఆశించిన కత్తెర పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఆర్మూర్‌ మండలం గగ్గుపల్లిలో మంగళవారం మొక్కజొన్న క్షేత్రాలను ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అనురాధ, లవకుమార్‌రెడ్డి, శ్రీలత, మల్లయ్య, ఏరువాక శాస్త్రవేత్త నవీన్‌కుమార్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బలరాం, ఆర్మూర్‌ ఏడీఏ హరికృష్ణ పరిశీలించారు. కత్తెర పురుగు ఉద్ధృతంగా ఉన్నట్లు గుర్తించారు. నివారణకు రెండు కిలోల బెల్లం, ఐదు కిలోల తవుడు, సైనోసాడ్‌ పురుగు మందు కలిపి విషపు ఎరలు తయారు చేసుకొని పైరులో చల్లుకోవాలని సూచించారు. వెంట ఏఈవోలు వసుదాం, నరేష్‌కుమార్‌, రైసస గ్రామ అధ్యక్షుడు భూగోళ్ల ప్రదీప్‌ ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here