కదం తొక్కిన కార్మికులు

0
2


కదం తొక్కిన కార్మికులు

నగరంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కొనసాగుతున్న దీక్షలు


ర్యాలీగా వొెళ్తున్న కార్మికులు

కామారెడ్డి పట్టణం, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికులు గళమెత్తారు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కొత్త బస్టాండు నుంచి కలెక్టరేట్‌ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి ఐకాస, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, భాజపా నాయకులు మద్దతు ప్రకటించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వమే నష్టాల్లోకి నెట్టడానికి యత్నిస్తోందని.. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు వీడీ దాస్‌, హరినాథ్‌, ఎస్‌కే మూర్తి, రమేష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, న్యాయవాద ప్రతినిధి సిద్దిరాములు, ఇతర పక్షాల నాయకులు మద్దతు ప్రకటించారు.

రోడ్డెక్కిన 552 బస్సులు

ఐదో రోజూ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపించారు. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 552 బస్సులు వివిధ మార్గాల్లో తిరిగాయి.

 

నిజామాబాద్‌ జిల్లాలో డిపోలు : 04

తిరిగిన బస్సులు(ఆర్టీసీ, అద్దె) : 331

కామారెడ్డి జిల్లాలో డిపోలు : 02

తిరిగిన బస్సులు(ఆర్టీసీ, అద్దె) : 221Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here