కదులుతున్న డొంక

0
2


కదులుతున్న డొంక

వెలుగులోకి అనుమతి లేని ఔషధ దుకాణం

రూ.5 లక్షల విలువ చేసే పరికరాలు స్వాధీనం

తనిఖీ చేస్తున్న ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఆసుపత్రులకు నేరుగా రక్తం సేకరించి రోగులకు ఎక్కిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా సమాచారంతో రెండు రోజుల కిందట బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తనిఖీలు చేసినప్పుడు రక్తం సేకరించే సంచి(బ్యాగ్‌) బయట పడింది. అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. వీక్లీమార్కెట్‌లోని ఓ నివాస గృహంలో అనుమతి లేకుండా గుట్టుగా నిర్వహిస్తున్న రోగనిర్ధరణ పరికరాలు విక్రయించే ఏజెన్సీ వెలుగు చూసింది. ఈ తనిఖీల్లో రూ.5 లక్షలు విలువ చేసే రోగనిర్ధ.రణ పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు. శ్రీసాయి ఏజెన్సీస్‌, పోలీస్‌లైన్‌, ఎల్లమ్మగుట్ట పేరుతో 2009లో ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తీసుకొన్నారు. ఒక ప్రాంతంలో అనుమతి తీసుకొని అక్కడి నుంచి ఖలీల్‌వాడికి మార్చారు. మళ్లీ అక్కడి నుంచి వీక్లీమార్కెట్‌లోని నివాస గృహంలోకి మార్చారు. ఎలాంటి అనుమతి లేకుండానే రోగ నిర్ధ.రణ పరికరాలు, రక ్తపరీక్షలకు అవసరమైన రసాయనాల విక్రయాలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఏజెన్సీని నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేసి, ఏజెన్సీని సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు రాజ్యలక్ష్మి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ప్రవీణ్‌, శ్రీలత, హేమలత పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here