కన్నీళ్లు ఆగడం లేదు, చేతుల్లేని ఆ చిన్నారిని చూసి.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం

0
3


హీంద్ర గ్రూప్ అధిపతి నేత ఆనంద్ మహీంద్ర కన్నీళ్లు పెట్టుకున్నారు. సామాజిక సందేశాలతోపాటు ఎప్పుడూ సరదా ట్వీట్లతో నవ్వులు పూయించే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కారణం.. ఓ చిన్నారి. చేతుల్లేని ఆ చిన్నారి.. కాళ్లతో ఫోర్క్ పట్టుకుని ఆహారం తినేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఆయన్ని కదిలించింది. దీంతో ఆయన ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి.. భావోద్వేగ ట్వీట్ చేశారు.

Read also: మిస్సయిన కూతురు ‘పోర్న్’ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం.. ఫొటోలు చూసి షాకైన తల్లి

‘‘నా మనవడి వీడియోను ఇటీవలే చూశాను. కానీ, వాట్సాప్‌లో చూసిన వీడియోను చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు ఎందుకు ఆపుకోలేకపోతున్నానో తెలియడం లేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతాయి. వాటిని మనం బహుమతిగా భావించి.. అనుకూలంగా మలచుకోవడమే ముఖ్యం. ఇలాంటివి చూస్తున్నప్పుడు నాలో ధైర్యం రెట్టింపు అవుతుంది’’ అని ట్వీట్ చేశారు.

పుట్టుకతోనే చేతులు కోల్పోయిన చిన్నారి.. తన కాళ్లతోనే ఆహారం తినడానికి ప్రయత్నించింది. మొదటి ప్రయత్నంలో ఆ ఆహారాన్ని నోటిలో పెట్టుకోలేకపోయింది. రెండో ప్రయత్నంలో విజయవంతంగా దాన్ని తినగలిగింది. ఆమె పట్టుదల చూసి ఆనంద్ మహీంద్ర ఈ ట్వీట్‌ను చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజనులు కూడా భావోద్వేగానికి గురవ్వుతున్నారు.

Read also: పార్కులో గ్యాంగ్ రేప్.. ‘ఫేస్‌బుక్‌’తో అన్నదమ్ముల అఘాయిత్యాలు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here