కబడ్డీలో అభివందనం

0
3


కబడ్డీలో అభివందనం

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన విద్యార్థి

న్యూస్‌టుడే, మాక్లూర్‌ గ్రామీణం

మారుమూల గ్రామీణ విద్యార్థి. కబడ్డీపై మక్కువ పెంచుకొన్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైంది. వ్యాయామ ఉపాధ్యాయుని సహకారం లభించింది. ఇంకేం ఏకంగా అంతర్జాతీయ పోటీల్లోనే మెరిశాడు అభినవ్‌.

పాఠశాలలో నిర్వహించే కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీల్లో అభినవ్‌ ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్నాడు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన పాఠశాల ఛైర్మన్‌ పొల్కం చంద్రశేఖర్‌, వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు సాయిలు కబడ్డీలో శిక్షణ ఇచ్చారు. వారి సలహాలు, సూచనల మేరకు క్రీడపై పట్టు పెంచుకున్నాడు. మైదానంలో కూతకు వెళ్లడం, ఎదుటి వ్యక్తి వస్తే పట్టేయడంలో దిట్ట. శ్వాసను ఆపడంలో తనకు తానే సాటి.

సాధించిన విజయాలు…

● 2019 మే.. వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సొంతం. ● జూన్‌.. దిల్లీలో 9వ నేషనల్‌ రూరల్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ. ● ఆగస్టు.. నేపాల్‌లో సౌత్‌ ఏసియన్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకొన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై తలపడగా.. ఇందులో అభినవ్‌కు 16 పాయింట్లు వచ్చాయి. అన్ని మ్యాచ్‌ల్లో కలిపి ఒక్కడికే 100కు పైగా పాయింట్లు ఉండటంతో అక్కడివారు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రపంచకప్‌ ఆడాలన్నదే లక్ష్యం

నాకు చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆట అంటే ప్రాణం. ప్రపంచకప్‌లో మన దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం నిత్యం సాధన చేస్తున్నా.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here