కరివెన, బోయినపల్లి సహా తెలుగు రాష్ట్రాల్లో ICICI 57 కొత్త శాఖలు

0
1


కరివెన, బోయినపల్లి సహా తెలుగు రాష్ట్రాల్లో ICICI 57 కొత్త శాఖలు

హైదరాబాద్/అమరావతి: ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో కొత్త 57 బ్రాంచీలు తెరవనున్నట్లు గురువారం ప్రకటించింది. తద్వారా రిటైల్ నెట్ వర్క్‌ను విస్తరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటిని ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. రిటైల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

2019-20లో దేశవ్యాప్తంగా 450 కొత్త బ్రాంచీలను ప్రారంభించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 388 శాథలు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 23 బ్రాంచీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోని 402 ఐసీఐసీఐ బ్రాంచీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 179, తెలంగాణలో 223 ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,580 ఏటీఎం సెంటర్లు ఉన్నట్లు తెలిపింది. కర్నూలు జిల్లాలోని కరివెన, మహబూబ్‌నగర్ జిల్లాలోని బోయినపల్లె గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here