కర్ణాటలో మధ్యంతర ఎన్నికలు… తప్పవు….! దేవేగౌడ

0
0


కర్ణాటలో మధ్యంతర ఎన్నికలు… తప్పవు….! దేవేగౌడ

కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర్రంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయని మాజీ ప్రధాని జేడిఎస్ నాయకుడు హచ్‌డీ దేవేగౌడ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అయిదు సంవత్సరాల పాటు తమకు మద్దతు తెలుపుతామని ప్రమాణం చేసిందని, తన మాటను నిలబెట్టుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని ఆయన వ్యాఖ్యనించారు. మరోవైపు కర్ణాటక ప్రజలు తెలివిగల వారని వారు కాంగ్రెస్ చేస్తున్న చర్యలను ఎప్పుటికప్పుడు గమనిస్తున్నారని అన్నారు.

అలయెన్స్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చేప్పలేను.

కాగ గత కొద్ది రోజులుగా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విబేధాలు బయటపడుతున్న నేపథ్యంలో దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ గురించి పరాజయం గురించి మాట్లాడిన దేవేగౌడ రాష్ట్ర్రంలో అలయెన్స్ ప్రభుత్వం ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదని అన్నారు.అయితే నా వైపు ఎలాంటీ ప్రమాదం లేదని కాంగ్రెస్ పార్టీ చేతులో ఉందని స్సష్టం చేశారు.

  బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  కుమారస్వామీ కూడ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకోలేదు.

  కుమారస్వామీ కూడ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకోలేదు.

  కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే సంకీర్ణ ప్రభుత్వం ఎర్పడిందన్న ఆయన పార్టీ ఒప్పందాల కోసం గులామ్‌నబీ అజాద్ అశోక్ గెహ్లాట్ బెంగళూరుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే గతంలో సంకీర్ణ ప్రభుత్వాల తీరుపై వివరించానని అన్నారు.అయితే ముఖ్యమంత్రిగా మల్లికార్జున ఖార్టే పేరును సైతం తాను సూచించాని కాని కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు ఒప్పుకోలేదని అన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్ గాంధి భావించారని అన్నారు.

  జేడీఎస్‌లో విభేధాలు

  జేడీఎస్‌లో విభేధాలు

  మరోవైపు కాంగ్రెస్‌తోపాటు జేడీఎస్‌లో కూడ విబేధాలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలోనే జేడిఎస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర్ర అధ్యక్షుడు విశ్వనాథ్ తన పదవికి రాజీనామ చేశారు. దీంతో పార్టీ నేతలతో దేవేగౌడ సమావేశం అయ్యారు.సమావేశంలోనే మధ్యంతర ఎన్నికలు సిద్దంగా ఉండాలని పిలుపినిచ్చినట్టు తెలుస్తోంది. కాగా పరిస్థితులు బాగాలేని సమయంలో రాజీనామ చేయడం కరెక్టు కాదని ఆయన సర్థిచెప్పినట్టు తెలుస్తోంది.

  లోక్‌సభ ఎన్నికల్లో సైతం డీలా పడ్డ కూటమీ

  లోక్‌సభ ఎన్నికల్లో సైతం డీలా పడ్డ కూటమీ

  2018లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 222 సీట్లకు గాను బీజేపీ 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు రాగా 37 స్థానాలు ఉన్న జేడీఎస్‌ అభ్యర్థి దేవేగౌడ కుమారుడు, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో సైతం సైతం మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 26 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ , జేడీఎస్‌లు చెరో స్థానంలో గెలిచాయి.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here