కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం చేయాలి

0
1


కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం చేయాలి

పిట్లం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలకేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులను ఠాణాలకు తరలించి, నిర్భందించడం, కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్‌ చెప్పిందే వేదమని మండిపడ్డారు. కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తునా హాజరై విజయవంతం చేయాని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, శివ, రాము, బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here