కలెక్టర్‌ చెప్పిన అంతేనా!

0
2


కలెక్టర్‌ చెప్పిన అంతేనా!

యూడీసీ రాకపోవడంతో మూసి ఉన్న కార్యాలయం గది

ఎడపల్లి, న్యూస్‌టుడే: ఎడపల్లి ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరు మార్చుకోవాలని స్వయానా జిల్లా పాలనాధికారి చెప్పినా వారిలో మార్పు లేదు. సోమవారం సమయపాలన పాటించలేదు. ఉదయం 9 గంటలకు వైద్యాధికారిణి, ఫార్మాసిస్టు, ఒక అటెండర్‌ మాత్రమే వచ్చారు. మిగతా సిబ్బంది రాలేదు. ల్యాబ్‌ టెక్నిషీయన్‌ 9:20, ఆయూష్‌ విభాగం వైద్యుడు 9:30, సూపర్‌వైజర్‌ 9:45, ఆసుపత్రి పాలనాధికారి ఏకంగా 10:15 గంటలకు వచ్చారు. ఓ స్టాఫ్‌ నర్సు, యూడీసీ సెలవులో ఉన్నారు. 9 గంటల్లోపు 9 మంది సిబ్బందికి గాను ఏడుగురే హాజరయ్యారు.

ఏడుగురికి నోటీసులు..

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆసుపత్రిలోని ఏడుగురు సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి పాలనాధికారి, వైద్యాధికారిణి, ఫార్మాసిస్టు, స్టాఫ్‌ నర్సు, ఇద్దరు సూపర్‌వైజర్లు, ల్యాబ్‌ టెక్నిషీయన్‌కు నోటీసులు అందాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here