కల్తీ పదార్థాల వినియోగంతో అనర్థాలు

0
2


కల్తీ పదార్థాల వినియోగంతో అనర్థాలు

కంఠేశ్వర్‌, న్యూస్‌టుడే: కల్తీ పదార్థాల వినియోగంతో ఎన్నో అనర్థాలు కలుగుతాయని  వినియోగదారుల ఫోరం జిల్లాధ్యక్షురాలు సువర్ణజయశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల (కోటగల్లీ)లో రాష్ట్రస్థాయి వినియోగదారుల అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో కల్తీ ప్రమాదకర స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ప్రతి వస్తువులో కల్తీ ఉంటుందన్నారు. ఆహార పదార్థాల్లో రసాయనాలు కలపడంతో మహిళల్లో సంతానలేమి, పీసీవోడీ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడంతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అంతర్జాలంలో కొనుగోలు చేసే ముందు ఐఎస్‌ఐ మార్కు ఉందో లేదోనని చూడాలన్నారు. తూనికలు, కొలతల్లో మోసాలు జరిగితే చట్టాలకు అనుగుణంగా కేసులు వేయవచ్చునన్నారు. దుకాణాల పేరుతో ముద్రించిన సంచులకు డబ్బులను తీసుకుంటున్నారని, వాటిని విక్రయించడానికి వీల్లేదన్నారు. ప్రతి రంగం వినియోగదారుల ఫోరం కిందికి వస్తోందని, సేవలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా సమాచార కేంద్రం నిర్వాహకుడు ఎం.రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ కళాశాల(కోటగల్లీ) ప్రిన్సిపల్‌ నుస్రత్‌ జహాన్‌, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది గౌరిశంకర్‌రావు, నల్సార్‌ వర్సిటీ ఆచార్యులు బాలకృష్ణ, జిల్లా తూనికలు, కొలతల శాఖాధికారి నిర్మల్‌కుమార్‌, వినియోగదారుల ఫోరం ప్రధాన కార్యదర్శి శంకర్‌లాల్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారి రవీందర్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here