కళాకారులను ఆదుకోవాలి

0
1


కళాకారులను ఆదుకోవాలి

సభలో మాట్లాడుతున్న కామటి ఐలయ్య

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి వారిని ఆదుకోవాలని కళాకారుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కామటి ఐలయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కళాకారుల వేదిక జిల్లా ప్రథమ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాకా కళాకారులకు ఆదరణ కరవైందని, అతి తక్కువ మందిని గుర్తించి వారిని అన్ని రకాలుగా ఆదుకోవడం సరి కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు వేలాది మంది కళాకారులు గజ్జె కట్టి ఆడి పాడారని , స్వరాష్ట్రంలో కళాకారులకు గడ్డు పరిస్థితులు దాపురించాయని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యమ్రంలో వేదిక జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, జిల్లా కన్వీనర్‌ రెడ్డి రాజన్న, వివిధ పక్షాల ప్రతినిధులు పుట్ట మల్లికార్జున్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here