కళేబరాల వ్యర్థాలను అడ్డుకున్న గ్రామస్థులు

0
0


కళేబరాల వ్యర్థాలను అడ్డుకున్న గ్రామస్థులు

వాహనంతో పాటు వ్యక్తుల నిర్బంధం

క్యాసంపల్లి శివారులో కళేబరాల వ్యర్థాలను పడేసిన స్థలాన్ని చూపిస్తున్న గ్రామస్థులు

క్యాసంపల్లి(కామారెడ్డి గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని క్యాసంపల్లి శివారులో పశువుల కళేబరాల వాహనాన్ని గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు. కామారెడ్డికి చెందిన కొందరు వ్యక్తులు వాహనంలో పశువుల ఎముకలు, వ్యర్థాలను తీసుకొచ్చి గ్రామ శివారులో వేయడాన్ని గ్రామస్థులు గమనించారు. సమాచారం అందుకున్న సర్పంచి నారాయణరెడ్డి, ఉప సర్పంచి బాలకిషన్‌గౌడ్‌, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, ఆయా పార్టీలకు చెందిన నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని నిలిపివేశారు. వ్యర్థాలను తీసుకొని వచ్చిన వ్యక్తులను ని ర్బంధించారు. గ్రామ శివారులో వ్యర్థాలను వేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. కామారెడ్డి పారిశుద్ధ్య విభాగానికి చెందిన జవాన్‌ ఫర్వేజ్‌ అనుమతి తీసుకున్నామని వారు పేర్కొనడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి వెంటనే తహసీల్దారు రాజేందర్‌, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌లకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది క్యాసంపల్లిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేయాలని గ్రామస్థులు డిమాండు చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ… వ్యర్థాలను వేసిన ప్రాంతంలో చెరువు, బోరుబావులు ఉన్నాయని నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, కుక్కలు సంచరించి చిన్నపిల్లలు, వృద్ధులను కరుస్తున్నట్లు వాపోయారు. గ్రామంలోకి దుర్గంధం వెదజల్లుతోందని ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. వాహనాన్ని ఠాణాకు తీసుకెళ్లి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here