కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలను అన్ని రకాలుగా అధుకోవడమే సిఎం కేసీఆర్‌ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 216 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 4 లక్షల 5 వేల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. గత 6 నెలల్లో 500 మందికి 5.29 కోట్ల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. పేదలను అన్ని రకాలుగా అదుకోవడం కోసమే కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా మొదటగా ఇచ్చిన 51 వేల రూపాయలు పెళ్లి ఖర్చులకు సరిపోవడం లేదని, ఇప్పుడు ప్రతి లబ్ధిదారులకు ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here