కళ్లకు గంతలు కట్టుకొని నిరసన

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, పట్టణ అధ్యక్షుడు ఆకుల శివ కష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బస్సులు లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు వారి అమూల్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన ఉద్యోగాలు ఏర్పడతాయని ఆశించిన నిరుద్యోగులకు ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు ప్రవేశ పెట్టడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావడం జరగదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు సకాలంలో బస్సులు నడిపించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రాజు నవీన్‌, సతీష్‌, పవన్‌, విజయ్‌, నరేందర్‌, గోపాల్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here