కశ్మీర్‌పై అమేరికా యూ టర్న్… భారత్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పిన పెద్దన్న

0
0


కశ్మీర్‌పై అమేరికా యూ టర్న్… భారత్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పిన పెద్దన్న

కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అంతర్జాతీయ దుమారం రేగుతోంది. ఓవైపు పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితిలో పిర్యాధు చేసేందుకు సన్నద్దం అవుతున్న నేపథ్యంలోనే మరోవైపు అగ్రదేశాలు కశ్మీర్ పై జోక్యం చేసుకుంటున్నాయి. ఆనేపథ్యంలో జమ్ము కశ్మీర్ నిర్ణయంపై పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు భారత దేశం అన్ని వైపుల పావులు కదిపింది. దీంతో కశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాలకు ముందుగానే సమాచారం అందించామని ప్రకటించింది. పాకిస్థాన్ ఆటలకు బ్రేక్ వేసేందుకు ముందుగా ఐక్యరాజ్య సమితి లో అయిదు శాశ్వత సభ్య దేశాలతో పాటు పది తాత్కాలిక సభ్య దేశాలకు కూడ సమాచారం అందించామని ప్రకటించింది.

అయితే కశ్మీర్ విభజనపై తమకు ఎలాంటీ ముందస్తు సమాచారం ఇవ్వలేదని దీంతోపాటు ఎలాంటీ సంప్రదింపులు కూడ జరపలేదని అమేరికాకు చెందిన సౌత్ మరియు సెంట్రల్ ఏషియా వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. దీంతో భారత దేశం తమకు సమాచారం ఇచ్చిందన్న ప్రకటనను తిప్పికోట్టింది. కాగా భారత విదేశాంగా మంత్రి జయశంకర్ యూఎస్ సెక్రటరీ మైక్ పోంపియో కు వివరించినట్టు జాతీయ దిన పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

ఇక మరో అగ్రరాజ్యమైన చైనా భారత దేశం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. లద్దాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం చైనా భూబాగాన్ని భారత దేశం అక్రమించే ప్రయత్నం చేస్తుందని దీన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆదేశం ప్రకటిచింది.

ఈ నేపథ్యంలోనే చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకొని రావడాన్ని చైన తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటూ చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత దేశం చేసిన చట్టాల ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని తక్కువ చేయాలని చూస్తుందంటు పేర్కోంది.. ఇది ఏ మాత్రం అమోదయోగ్యం కాదని తెలిపింది. అలాగే సరిహద్దు వివాదాలను మరింత క్షిష్టతరం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here