కశ్మీర్‌లో విద్వేషకులకు మద్దతా ?.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై డీజీపీకి ఫిర్యాదు (వీడియో)

0
3


కశ్మీర్‌లో విద్వేషకులకు మద్దతా ?.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై డీజీపీకి ఫిర్యాదు (వీడియో)

  కశ్మీర్‌లో విద్వేషకులకు మద్దతా ?.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై డీజీపీకి ఫిర్యాదు (వీడియో)

  హైదరాబాద్ : సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ఆపాలని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలకు కంప్లైంట్ చేసినా .. పట్టించుకోలేదన్నారు. భారత సైన్యంపై చేస్తున్న ఆరోపణల గురించి డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని కోరారు. 130 కోట్ల మంది భారత ప్రజలను కించపరిచేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

  కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తీసివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యను పాకిస్థాన్‌లోని కొందరు ఫేక్ ఐడీలతో విషం ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలను సీనియర్ అడ్వకేట్ పొలిశెటి అరుణ్ కుమార్ సేకరించారు. భారత సైన్యం చేస్తున్న సేవలను కాదని .. తప్పుడు ప్రచారం చేయడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలు మార్క్ జుకర్ మార్క్, ఫ్యాట్రిక్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా వెబ్‌సైట్లలో కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు సరికదా .. రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో అరుణ్ కుమార్ ఇవాళ డీజీపీ మహేందర్ ‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయా సైట్లలో కొందరు చేస్తున్న కామెంట్లకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. వాటి ఆధారంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  action take against facebook, twitter.. arunkumar complained to dgp

  కశ్మీర్ భారత్‌లో కలువడంతో ఇక నుంచి హత్యలు, లైంగికదాడులు జరుగుతాయని విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు అరుణ్ కుమార్. ఎండనక, వాననక ప్రజల కోసం సేవ చేస్తున్న ఆర్మీని కించపరచడం సరికాదన్నారు. వారి నైతికతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదివరకు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేస్తే.. హర్షించాల్సింది పోయి.. నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇది సరికాదని .. వారి ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకోని చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై జుకర్ బర్గ్, ఫ్యాట్రిక్‌కు నోటీసులు జారీచేయాలని డిమాండ్ చేశారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here