కశ్మీర్‌ ప్రజల పోరాటానికి మద్దతివ్వాలి

0
0


కశ్మీర్‌ ప్రజల పోరాటానికి మద్దతివ్వాలి


మాట్లాడుతున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌

ఖలీల్‌వాడి : కశ్మీర్‌ ప్రజలు వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాల్సిన అవసరం ఉందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ పేర్కొన్నారు. పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో కశ్మీర్‌ ప్రజల హక్కులకు ఉద్యమిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కశ్మీర్‌ ప్రజల ఆకాంక్ష, ప్రమేయం లేకుండా ప్రత్యేక చట్టబద్దమైన హక్కులు ఆర్టికల్‌ 370, 35లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కశ్మీర్‌ యువత, విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఏపీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు సంగం, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధానకార్యదర్శి రవీందర్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, యువజన, మహిళా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here