కశ్మీర్ కల్లోలం పై ఏకమైన కశ్మీర్ ప్రతిపక్ష పార్టీలు… ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో సమావేశం

0
0


కశ్మీర్ కల్లోలం పై ఏకమైన కశ్మీర్ ప్రతిపక్ష పార్టీలు… ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో సమావేశం

జమ్ము కశ్మీర్‌లో ఏదో కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ఉహాగాహాల నేపథ్యంలో కశ్మీర్‌ పార్టీల నేతలు ఒక్కటయ్యారు. స్థానిక పార్టీలకు నాయకత్వం వహిస్తున్న పీడీపీ,నేషనల్ కాన్ఫరెన్స్ తోపాటు వేర్పాటు వాద సంస్థలు శ్రీనగర్‌లోని ఫరూక్ అబ్ధుల్లా నివాసంలో సమావేశం అయ్యాయి. ఈనేపథ్యంలోనే సోమవారం ప్రధానిని కలిసి పరిస్థితిపై చర్చించాలని వారు నిర్ణయించారు.

జమ్ము కశ్మీర్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అంశం ఆ రాష్ట్ర నేతలకే అంతుపట్టడడం లేదు. ఓ వైపు వేలాదిగా భద్రతా దళాల మోహరింపు మరోవైపు కశ్మీరేతరులు వెళ్లిపోవాలని ఆదేశాలు, దీంతో రాష్ట్రంలో టెన్షన్ వాతవరణం నెలకోంది. దీంతో కశ్మీర్‌లో జరిగబోయో పరిణామాలపై అక్కడి రాజకీయ పక్షాలు ఎకమయ్యాయి. గతంలొ ఎప్పుడు రాష్ట్ర సమస్యలపై కలిసి రాని పార్టీలు ఒకే వేదిక మీదకు చేరుకున్నాయి. ఈ సంధర్భంలోనే అమర్‌నాథ్ యాత్రికులను ఎందుకు వెనక్కి పంపుతున్నారో మాకు అర్థం కావడం లేదని పలువురు నేతలు ప్రకటించారు.

కాగా భారత్, పాకిస్థాన్ లు కశ్మీర్ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించాలని లేదంటే, కశ్మీర్‌ లోయలో ఉత్పన్నమయ్యో పరిణామాలు చాల దారుణంగా ఉంటాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా అన్నారు. కశ్మీర్ అన్ని పార్టీలు కలిసి శాంతి స్థాపనకు క‌ృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని సంరక్షించాలని ఆయన కోరారు. ఈ అంశలను ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతికి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు.

మరోవైపు కశ్మీర్‌ నుండి బయటకు వచ్చే వారి కోసం రైల్వేల్లో నామమాత్రపు తనిఖీలు ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. అంటే ఎలాంటీ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా కశ్మీర్ ప్రాంతం నుండి సేఫ్‌గా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనికి తోడు విమానయాన సంస్థలు కూడ డిమాండ్‌కు అనుగుణాంగా టికెట్ల రెట్లను పెంచకూడదని విమానాయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలోనే రేట్లను ఫిక్స్ చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here