కశ్మీర్ కాక చల్లారినట్టేనా..! పాక్ కుయుక్తులు పని చేస్తాయా..?

0
1


కశ్మీర్ కాక చల్లారినట్టేనా..! పాక్ కుయుక్తులు పని చేస్తాయా..?

డిల్లీ/హైదరాబాద్ : ఏళ్ల తరబడి నలిగిన కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించింది. కట్టుబాట్లు, ఆంక్షలు, పరమితుల నుంచి కశ్మీర్ స్వేచ్చా వాయువులు పూర్తి స్తాయిలో పీల్చుకున్నట్టేనా..? ఇంకా ఏమైనా మిగిలి ఉందా అనే సందేహాలు కశ్మీర్ సామాన్య పౌరుల నుంచి వ్యక్తం అవుతోంది. ఇదే అంశం పై కొంత మంది రాద్దాంతం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని చెప్పడంతో ఆర్టికల్ 370 రద్దు పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సమస్య పూర్తి స్తాయిలతో పరిష్కారం అయ్యిందా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకు పాకిస్తాన్, చైనా వంటి దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా గుప్పిస్తున్నాయి.

కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం..! విషం చిమ్ముతున్న పాకిస్తాన్..!!

ఏళ్ల తరబడి సాగిన కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 72 ఏళ్లనాటి సంకెళ్లు తెంచారు. కశ్మీరాన్ని భారత్ లో అంతర్భాగమంటూ ప్రపంచానికి చాటారు. నిజంగానే ఇది చరిత్రలో నిలిచేరోజు ఎవ్వరూ దాన్ని తప్పుబట్టరు. మనం గెలిచినా.. మన శత్రువులు ఓడినట్టుగానే భావిస్తున్నారు. చైనా, పాకిస్తాన్ ను మించిన రాజకీయ శక్తులు ఎక్కడ అంతర్గత కలహాలకు తెరతీస్తాయనే భయం బారతీయుడి గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తుంది. దీనికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్ , కశ్మీరంలోని ప్రాంతీయపార్టీలు వంతపాడుతున్నాయి. నేను కూడా వ్యతిరేకినేనంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కన్నెర్ర చేశాడు. దీనికి బదులుగా అమిత్ షా గట్టిగానే బదులిచ్చినా అసద్ వంటి వక్ర బుద్దులు గల వ్యక్తులు ఇంకెంతటికైనా బరితెగించేందుకు వెనుకాడరనేది గమనించాల్సిన అంశం. 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ ప్రజలు భారతీయులతో కలసిపోతారంటోంది ప్రభుత్వం. అక్కడ ముస్లిం యువత నరనరాల భారత్ వ్యతిరేకత పెల్లుబుకుతుంటే ఇది సాద్యమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.. దీనికి ఉగ్రవాద గ్రూపులే కాదు.. పాకిస్తాన్ కూడా అదను కోసం ఎదురుచూస్తుంది.

వంత పాడుతున్న చైనా..! సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్..!!

వంత పాడుతున్న చైనా..! సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్..!!

చైనా కూడా తన అక్కసును ఇప్పటికే వెళ్లగక్కింది. ఇంతటి ఏకపక్షంగా బారత్ నిర్ణయం తీసుకోవటం సరికాదంటూ స్పందించింది. దీనికి బదులుగా మన విదేశాంగ శాఖ జవాబు చెప్పినా అది ఎంతమేర ప్రభావం చూపుతుందనేది కూడా ప్రశ్నార్థకమే. ప్రధానమంత్రి మోదీ మాత్రం చాలా ధీమాగా.. మున్ముందు జరగబోయే సంఘటనలకు బదులివ్వగలమనేంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నిజంగానే ఇది చారిత్రక నిర్ణయమే అనే భావన ప్రజల్లో ఇంతగా రావటానికి మోదీ మాటతీరు.. నిర్ణయమే కారణాలు. అయితే.. మున్ముందు కశ్మీర్ ప్రశాంతంగా ఉంటుందనేందుకు ఎటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఓ వైపు పాకిస్తాన్ కార్గిల్ తరహాలో భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బలగాలను సిద్ధం చేసింది.

మొహరించిన సైనికులు..! దేనికైనా రెఢీ అంటున్న ఇండియన్ సోల్జర్స్..!!

మొహరించిన సైనికులు..! దేనికైనా రెఢీ అంటున్న ఇండియన్ సోల్జర్స్..!!

సుమారు లక్షమంది పాక్ సైనికులు అవతల సరిహద్దులో రెడీగా ఉన్నాయి. దానికి ధీటుగా బదులివ్వాలనే ఉద్దేశంతోనే కశ్మీర్ లో శాంతి ఫేరిట భారత్ కూడా 40,000 మంది సైనికులను రెడీగా ఉంచింది. మరో లక్ష మంది అదనపు బలగాలను ఎప్పుడు పిలిచినా సరిహద్దుకు చేరేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు.. ఇవన్నీ చూస్తున్న చైనా కూడా ఇదే అదనుగా పీవోకే లో పాక్ బహుమతిగా ఇచ్చిన ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించే పనిలో ఉంది. శ్రీలంక బేస్ గా చేసుకుని యుద్ధ వ్యూహాలను అమలు చేసేందుకూ వీలుంది.

భారత్ సాహసోపేత నిర్ణయం..! వ్యతిరేకిస్తున్న కొన్ని దేశాలు..!!

భారత్ సాహసోపేత నిర్ణయం..! వ్యతిరేకిస్తున్న కొన్ని దేశాలు..!!

ఇప్పటికే చైనా అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అమెరికా భారత్ వైపు అండగా నిలిచే అవకాశాలున్నాయి. ఇజ్రాయేల్ కూడా తటస్థంగా ఉండే అవకాశాలున్నాయి. ఏమైనా రగులుతున్న కశ్మీరం ఇప్పటి చర్యతో చల్లారుతుందా.. మరింత అగ్గిరాజుకుని దేశాన్ని మంటపెడుతుందా. ఇలా ఎన్నో అనుమానాలు.. ప్రతి భారతీయుడి మనసును కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కానీ ఏదోమూలన భారతీయ సైనికుల శక్తి సామర్థ్యాలు.. ప్రపంచదేశాల్లో భారత్ ఘనత ఇవన్నీ పెను ఉపద్రవాన్ని దూరం చేస్తాయనే ధైర్యంగా ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here