కస్టమర్లకు ప్రయోజనాలు, వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకర్లు రెడీ

0
0


కస్టమర్లకు ప్రయోజనాలు, వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకర్లు రెడీ

న్యూఢిల్లీ: రుణాల వడ్డీరేట్లని సమీక్షించేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతులతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా, సిటీ బ్యాంకుల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో వడ్డీ రేట్లను ఈ కేలండరి ఇయర్లో మూడుసార్లు 75 బేసిస్ పాయింట్లు తగ్గించినా ఆ మేరకు కస్టమర్లకు ప్రయోజనం కల్పించలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లతో ఆర్థికమంత్రి భేటీ అయ్యారు.

కస్టమర్లకు ప్రయోజనాలు..

ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడల్లా ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు చెబుతోంది. కొన్ని సందర్భాలలో హెచ్చరిస్తున్నారు. ఇటీవల రెపో రేటు 6.50 నుంచి 5.75కు తగ్గించినా కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరలేదు. ఈ నేపథ్యంలో నిర్మల బ్యాంకర్లతో భేటీ అయ్యారు. బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల్ని సమీక్షించడంతో పాటు రుణ వృద్ధిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రెపో రేట్లను సవరించేందుకు బ్యాంకర్లు అంగీకారించినట్లు నిర్మల తెలిపారు. . ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్ఎఫ్‌సీ బ్యాంకు రుణాలపై కూడా చర్చ జరిగింది. బుధవారం ఆర్బీఐ ద్రవ్య, పరపతి సమీక్షలో పావుశాతం మేర వడ్డీ రేట్లు తగ్గవచ్చని అంచనా.

ఏం చెబుతారో వింటాం..

ఏం చెబుతారో వింటాం..

బడ్జెట్‌లో అధిక సంపన్న వర్గాలపై సర్‌ఛార్జీ విధించడం వల్ల FPIలు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో వాటిపై కూడా చర్చించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. FPI ప్రతినిధులతో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి త్వరలో చర్చలు జరుపుతారని, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినేందుకు తాము సిద్ధమని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇటీవల బడ్జెట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పన్ను ఆదాయంపై సర్‌ఛార్జ్‌ను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. రూ.5 కోట్లకు పైగా ఆదాయం ఉంటే సర్ ఛార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచారు.

రెండ్రోజుల్లో రూ.2,985 కోట్ల FPIలు వెనక్కి

రెండ్రోజుల్లో రూ.2,985 కోట్ల FPIలు వెనక్కి

దేశీయ కేపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెల 1, 2 తేదీల్లోనే FPIలు నికరంగా రూ.2,985.88 కోట్ల నిధుల్ని వెనక్కి తరలించారు. ట్రస్ట్స్/అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న FPIలు కూడా సూపర్ రిచ్ కేటగిరీలోకి వస్తున్నారు కాబట్టి వారు కూడా సర్‌ఛార్జి చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో నిధులు ఉపసంహరించుకుంటున్నారు.

షేర్ హోల్డింగ్స్‌ల్లో 25 శాతం వాటా నుంచి 30 శాతానికి..

షేర్ హోల్డింగ్స్‌ల్లో 25 శాతం వాటా నుంచి 30 శాతానికి..

స్టాక్ మార్కెట్లలో లిస్టయిన సంస్థల్లో పబ్లిక షేర్ హోల్డింగ్‌ను 25% నుంచి 30% పెంచడంపై మార్కెట్ రెగ్యులేటర సెబీ ఇప్పటికే వివిధ భాగస్వాములతో సంప్రదింపులను మొదలు పెట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధి రేటును తిరిగి పరుగులు పెట్టిస్తామని ఆమె చెప్పారు. వివిధ రంగాల ప్రతినిధులతో ఈ వారం భేటీ అవుతామని, వారికి, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్ఎస్ఎంఈ, ఆటోమొబైల్, పరిశ్రమ సంఘాలు, మార్కెట్లు, రియల్ ఎస్టేట్, .. ఇలా అన్ని రంగాల ప్రతినిధులతో ఈ వారంలో భేటీ కానున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here